• facebook
  • whatsapp
  • telegram

ఏపీ కేంద్రీయ వర్సిటీ  ఉపకులపతిగా సర్రాజు?

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో 2018-19 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య సర్రాజు రాయవరపు పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లోని హిందీ విభాగంలో ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సర్రాజు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు ప్రాంతానికి చెందినవారు.

  • Tags