• facebook
  • whatsapp
  • telegram

18 నుంచి ‘ఇంటర్‌’ పూర్తిస్థాయి మూల్యాంకనం 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అయిదు జిల్లాల్లో మే 14 న‌ ప్రారంభమైన ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం మే  18 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. రెడ్‌ జోన్‌లో పత్రాల కోడింగ్‌కు మే 14 న‌ కొంతమంది కలెక్టర్లు అనుమతించలేదు. ప్రస్తుతం జిల్లాకు ఒకటే మూల్యాంకన కేంద్రం ఉండగా.. దీన్ని రెండు, మూడు కేంద్రాలకు మార్చనున్నారు. ఏ జిల్లాకు అధ్యాపకులకు ఆ జిల్లాలోనే దిద్దే అవకాశం కల్పించడంపై ఇంటర్‌ విద్యామండలి ఆలోచిస్తోంది.
పాలిసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు
పాలిసెట్‌ దరఖాస్తులను జూన్‌ 15వరకు పొడిగించినట్లు సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌-19 కారణంగా పాలిసెట్‌ను వాయిదా వేశారు. పరీక్షను ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు.

  • Tags