• facebook
  • whatsapp
  • telegram

మనులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ(మను) వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు మే 14 న‌ వర్సిటీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. 2020-21 విద్యాసంవత్సరానికి ఆయా కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎడ్యుకేషన్‌, లాంగ్వేజెస్‌, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌, టెక్నాలజీ, మాస్‌ కమ్యూనికేషన్‌ జర్నలిజం, కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో 25 పీహెచ్‌డీ, 21 పీజీ, 8 యూజీ కోర్సులను వర్సిటీ నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్ష ఆధారిత కోర్సులకు జూన్‌ 10 లోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. మెరిట్‌ ఆధారంగా ప్రవేశం కల్పించే కోర్సులకు సంబంధించి దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 10 చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చని పేర్కొన్నారు.

  • Tags