• facebook
  • whatsapp
  • telegram

10  పరీక్షలకు అనుమతించండి

* వైద్యాధికారుల సలహా మేరకు ఏర్పాట్లు చేశాం
* హైకోర్టును అభ్యర్థించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల నిర్వహణకు అనుమతించాలంటూ హైకోర్టుకు మే 14 న‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పరీక్షల నిర్వహణకు వైద్యాధికారుల సలహా మేరకు ఏర్పాట్లు చేశామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మిగిలిన పరీక్షల నిర్వహణకు అనుమతించాలని కోరింది. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణను సవాలు చేస్తూ ఎం.బాలకృష్ణ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా పరీక్షలను వాయిదా వేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. ఈ మధ్యంతర ఉత్తర్వులను తొలగించి పరీక్షల నిర్వహణకు అనుమతించాలంటూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ కౌంటరు దాఖలు చేశారు. లాక్‌డౌన్‌ 29 వరకు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు, విద్యాసంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని మిగిలిన పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాల నుంచి విజ్ఞప్తుల మేరకు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించి అనుమతి కోరుతూ ఈ ప్రమాణపత్రం దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

  • Tags