• facebook
  • whatsapp
  • telegram

తనిఖీలు లేకుండానే ఓయూ గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. తనిఖీలు లేకుండా అనుబంధ కళాశాలలకు నేరుగా గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి, ఏఐసీటీఈ సూచనల మేరకు అకడమిక్‌ సమాచారం ఆధారంగా అనుమతులు మంజూరు చేయనుంది. ఉస్మానియా వర్సిటీ పరిధిలో 740 కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో డిగ్రీ కళాశాలలు 431, ఇంజినీరింగ్‌ 15, ఫార్మసీ 15, ఎంబీఏ 118, ఎంసీఏ 12, బీఈడీ 102 వరకు ఉన్నాయి. మిగిలినవి పీజీ, వివిధ విభాగాల రెసిడెన్షియల్‌ కళాశాలలు.

  • Tags