• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్‌ఈ 9, 11 తప్పిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు: కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: సీబీఎస్‌ఈ 9, 11 తరగతుల్లో తప్పిన విద్యార్థులకు ఆయా పాఠశాలల స్థాయిలోనే ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ సీబీఎస్‌ఈ పాఠశాలలను ఆదేశించింది. కరోనా నేపథ్యంలో 1-8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు పంపించగా..  9, 11 తరగతుల విద్యార్థులకు అంతర్గత పరీక్షల మార్కుల ఆధారంగా పదోన్నతి కల్పించారు. అంతర్గత పరీక్షల్లో తప్పిన వారికి కొద్ది రోజులు తరగతులు నిర్వహించి మళ్లీ పరీక్షలు తప్పనిసరిగా జరపాలని కేంద్రం ఆదేశించింది. వాటిల్లో పాసైతే వారు పైతరగతికి వెళ్తారు. ఈ విధానం కేవలం ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

  • Tags