• facebook
  • whatsapp
  • telegram

కనెక్ట్‌ ఛాన్సలర్‌ పోటీలకు 9 వేల మంది విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: కనెక్ట్‌ ఛాన్సలర్‌ పేరిట గవర్నర్‌ తమిళిసై విద్యార్థులకు కరోనా సంబంధిత అంశాలపై జరిపిన వ్యాసరచన, కవితల పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 9 వేల మంది పాల్గొన్నారు. ఈ-మెయిల్‌, వాట్సప్‌ ద్వారా తమ వ్యాసాలను పంపించారు. మొత్తం 36 మందిని విజేతలుగా ఎంపిక చేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. వారందరికీ జూన్‌ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాడు గవర్నర్‌ బహుమతులు అందజేస్తారని ఆయన వెల్లడించారు.

  • Tags