• facebook
  • whatsapp
  • telegram

భౌతికశాస్త్రం 46.. జీవశాస్త్రం 54

* పదోతరగతి నమూనా ప్రశ్నపత్రాల విడుదల
ఈనాడు, అమరావతి: పదోతరగతి నమూనా ప్రశ్నపత్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. గతంలో 50 మార్కులకు ఉండే ప్రశ్నపత్రాలను వంద మార్కులకు మార్చడంతో కొత్త ప్రశ్నపత్రాల నమూనాలను విడుదల చేసింది. సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలకు కలిపి 46, జీవశాస్త్రం నుంచి 54 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. సాంఘిక, గణితంలో పేపర్‌-1 లేదా పేపర్‌-2 నుంచి 8 మార్కులకు ఒక ప్రశ్న ఉంటుంది. మిగతా 92లో పేపర్‌-1, 2ల నుంచి తలో 46 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. తెలుగు నమూనా ప్రశ్నపత్రాన్ని మే 16న విడుదల చేస్తారు.
100 మార్కుల  ప్రశ్నపత్రాల వివరాలు

 

  • Tags