• facebook
  • whatsapp
  • telegram

ఐఐఎం రోహ్‌తక్‌ ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్ష 21న

* ఇళ్ల నుంచే రాయాలంటూ ఇటీవలే సమాచారం
ఈనాడు, హైదరాబాద్‌: మే 21న ఆన్‌లైన్‌లో ప్రవేశపరీక్ష నిర్వహించబోతున్నామని, ఇళ్ల నుంచే దానికి హాజరయ్యేలా ల్యాప్‌టాప్‌లు సిద్ధం చేసుకోవాలని ఐఐఎం రోహ్‌తక్‌ ఇటీవలే సమాచారం ఇవ్వడం నిరుపేద విద్యార్థుల్లో గుబులు పుట్టిస్తోంది. లాక్‌డౌన్‌తో ఖమ్మం, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో ఉంటున్న వారికి ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్‌ సౌకర్యం, స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచించడంతో ఆందోళన చెందుతున్నారు. సాంఘిక సంక్షేమశాఖ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థుల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసి ప్రత్యేకంగా జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చారు. అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వారు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇక్కడ శిక్షణ పొందిన వారిలో కొందరు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందిస్తున్న ఐఐఎం రోహ్‌తక్‌కు దరఖాస్తు చేశారు. వారికి ఇప్పుడు 21న ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తామని, ఇళ్ల నుంచే రాయవచ్చని మూడు రోజుల క్రితం సమాచారం ఇవ్వడంతో సమస్యను సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు.

  • Tags