• facebook
  • whatsapp
  • telegram

పీజీ వైద్య యాజమాన్య సీట్ల దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పరిధిలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో యాజమాన్య కోటాలోని పీజీ సీట్లకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును మే 20 వరకూ పెంచుతూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు మే 15తో ముగిసిపోవడంతో దాన్ని పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది.

  • Tags