• facebook
  • whatsapp
  • telegram

ఎన్టీఏ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

ఈనాడు, దిల్లీ: పలు పరీక్షల ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణ గడువును నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) పొడిగించింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌)-2020, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వ విద్యాలయం ప్రవేశ పరీక్ష (జేఎన్‌యూఈఈ)-2020, యూజీసీ జాతీయ అర్హత పరీక్ష (యూజీసీ-నెట్‌)-జూన్‌ 2020, సీఎస్‌ఐఆర్‌-జాతీయ అర్హత పరీక్ష (సీఎస్‌ఐఆర్‌-నెట్‌)-జూన్‌ 2020 దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగించింది. పూర్తి వివరాలకు ఆయా పరీక్షలకు సంబంధించిన వెబ్‌సైట్లు లేదా www.nta.ac.in ను  చూడవచ్చు.

  • Tags