• facebook
  • whatsapp
  • telegram

‘పది’ తెలుగులో వ్యాసరూప జవాబులకే 56 మార్కులు

ఈనాడు, అమరావతి: పదో తరగతి తెలుగు నమూనా ప్రశ్నపత్రాన్ని మే 16న‌ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి విడుదల చేశారు. 100 మార్కుల ప్రశ్నపత్రాన్ని వెబ్‌సైట్‌లో ఉంచారు. విభాగం-1లో అడిగే 4 వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులకు ఇచ్చారు. విభాగం-2లో మొత్తం 36 మార్కుల్లో 24 వ్యాసరూప సమాధానాలకే కేటాయించారు. ఇందులో ఇచ్చే మూడు వ్యాసరూప ప్రశ్నల్లో రెండు పేపర్‌-2 నుంచే వస్తాయి. విభాగం-3లో పేపర్‌-1లో 18, పేపర్‌-2లో 14మార్కులుంటాయి.

  • Tags