• facebook
  • whatsapp
  • telegram

ఆగస్టు 2న ఎస్పీఎంవీవీ-2020 పీజీ సెట్‌

మహిళా విశ్వవిద్యాలయం(తిరుపతి), న్యూస్‌టుడే: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ ప్రవేశాలకు ఏటా నిర్వహించే ఎస్పీఎంవీవీ - 2020 పీజీ సెట్‌ ప్రవేశ పరీక్షను ఆగస్టు 2న నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య మమత మే 16న‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 14న ఫలితాలు వెల్లడించి, నెలాఖరుకు ప్రవేశాలు పూర్తి చేయనున్నారు. పరిశోధన పత్రాల సమర్పణకు ఎంఫిల్‌, పీహెచ్‌డీ విద్యార్థినులకు మరో ఆరు నెలల గడువు ఇచ్చారు.

  • Tags