• facebook
  • whatsapp
  • telegram

ఓయూ పీజీ ఫలితాల విడుదల

ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలు మే 16న‌ వెలువడ్డాయి. గణితం, రసాయన శాస్త్రం, న్యూట్రిషన్‌-డైటెటిక్స్‌, వృక్షశాస్త్రం, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జన్యుశాస్త్రం, అప్లయిడ్‌ గణితం, లైబ్రరీ సైన్స్‌, గణితం-కంప్యూటర్‌ సైన్స్‌, ఖగోళశాస్త్రం, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల ఫలితాలను ప్రకటించినట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.శ్రీరామ్‌వెంకటేశ్‌ తెలిపారు. మరిన్ని వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.

  • Tags