• facebook
  • whatsapp
  • telegram

కేఎల్‌ఈఈఈ ఫలితాలు విడుదల

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం విజయవాడ, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్ష(కేఎల్‌ఈఈఈ) ఫలితాలను మే 17న విడుదల చేశారు. గవర్నర్‌పేటలోని కేఎల్‌యూ ప్రాంతీయ కార్యాలయంలో యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఎల్‌.ఎస్‌.ఎస్‌.రెడ్డి, కేఎల్‌ఈఈఈ కన్వీనర్‌ డాక్టర్‌ రామకృష్ణ, అడ్మిషన్స్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ జె.శ్రీనివాసరావు ఫలితాలను, కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను వెల్లడించారు. జూన్‌ 5 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపారు. ప్రతిభావంతులకు 10 శాతం నుంచి 100 శాతం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అందించి ఫీజులో రాయితీ ఇస్తామన్నారు. ఈ ఏడాది కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్సు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోర్సులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రవేశపరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
టాప్‌ 10 ర్యాంకర్లు: చిలుకూరి మణిప్రణీత్‌ 1వ ర్యాంకు, నిమ్మల అభిలోకేష్‌ 2, పోలినేని రామ్‌నివాస్‌ 3, మేకల అశ్విన్‌ కార్తీక్‌ యాదవ్‌ 4, కోటిపల్లి బాలసాయి అజయ్‌ 5, బొప్పూడి హర్షసాయి 6, చేతన్‌ సాయి ఆకాష్‌ 7, ఆర్‌.కిరీటి 8, చిట్టూరి శ్రీజాచౌదరి 9, కె.బి.హరిచరణ్‌ 10వ ర్యాంకు సాధించారు.

  • Tags