• facebook
  • whatsapp
  • telegram

194 ఏఈవో పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 ఏఈవో పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం ఆదేశాల మేరకు వెంటనే పొరుగుసేవల విధానంలో నియామకాలను మొదలుపెట్టాలని కలెక్టర్లను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. పాత ఉమ్మడి జిల్లాల ప్రకారం... ఆదిలాబాద్‌లో 25, కరీంనగర్‌లో 10, వరంగల్‌లో 21, ఖమ్మంలో 20, నిజామాబాద్‌లో 15, మెదక్‌లో 26, మహబూబ్‌నగర్‌లో 26, నల్గొండలో 22, రంగారెడ్డిలో 29 ఏఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులో నియమితులైనవారికి నెలకు రూ.17,500 చొప్పున వేతనం చెల్లిస్తారు.