• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌లో పీహెచ్‌డీ వైవాకు శ్రీకారం

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యూజీసీ వెసులుబాటు ఇచ్చిన నేపథ్యంలో పీహెచ్‌డీ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వైవా నిర్వహణకు జేఎన్‌టీయూహెచ్‌ సోమవారం శ్రీకారం చుట్టింది. మే 30 వరకు మొత్తం 24 మందికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైవా పూర్తి చేస్తామని విశ్వవిద్యాలయం పరిశోధన, అభివృద్ధి విభాగం సంచాలకుడు కె.విజయకుమార్‌రెడ్డి తెలిపారు. పీహెచ్‌డీ థీసిస్‌లు సమర్పించిన విద్యార్థుల్లో చాలామంది దేశవ్యాప్తంగా, మరికొందరు విదేశాల్లోనూ ఉన్నారన్నారు. మే 18న‌ నిర్వహించిన వైవాకు నెదర్లాండ్స్‌ నుంచి ఒక విద్యార్థి హాజరయ్యారని చెప్పారు.