• facebook
  • whatsapp
  • telegram

పీజీ ప్రవేశాల్లో సుప్రీం ఆదేశాలు అమలయ్యేలా చూడాలి: కన్నా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైద్య విద్య పీజీ ప్రవేశాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని, జీవో నంబరు 43ను సవరించాలని భాజపా రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు మే 20న‌ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ ప్రవేశాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని ఏపీ యాదవ ఉద్యోగులు, వృత్తి నిపుణుల సంఘం ఇచ్చిన వినతి పత్రాన్ని లేఖకు జత చేసినట్లు తెలిపారు.