• facebook
  • whatsapp
  • telegram

ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలతో భేటీ

ఈనాడు, అమరావతి: వైద్య, దంత వైద్య విద్య కోర్సుల ఫీజుల ఖరారుపై పలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ మే 20న‌ సమావేశమైంది. యాజమాన్యాల నుంచి వార్షిక ఆదాయం, వ్యయంపై అభిప్రాయాలను సేకరించింది. మే 21న‌ ఈ సమావేశాలు కొనసాగుతాయి.