• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ డిగ్రీలకు అనుమతివ్వండి: కేవీపీ

ఈనాడు, దిల్లీ: ఆన్‌లైన్‌ ద్వారా ఉన్నత విద్య, డిగ్రీలను అందించడానికి 100 విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు మే 22న  రాసిన ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆన్‌ లైన్‌ ద్వారా డిగ్రీలు అందజేస్తే 50% గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నిష్పత్తి లక్ష్యం నెరవేరుతుందన్నారు.