• facebook
  • whatsapp
  • telegram

తాత్కాలికంగా పంచాయతీ కార్యదర్శుల భర్తీ

* జిల్లా కలెక్టర్లను ఆదేశించిన ప్రభుత్వం
 ఈనాడు, హైద‌రాబాద్‌: కరోనా నియంత్రణ చర్యలు కొనసాగించేందుకు వీలుగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులను తాత్కాలిక పద్ధతిన భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రెగ్యులర్‌ నియామకాలను చేపట్టే వరకు పరిపాలనలో జాప్యం జరగకుండా వీటిని భర్తీ చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఈ మేరకు సంబంధిత పోస్టుల భర్తీకి వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది.