• facebook
  • whatsapp
  • telegram

సామాన్యశాస్త్రానికి రెండు జవాబు పత్రాలు!

ఈనాడు, అమరావతి: పదోతరగతి సామాన్యశాస్త్ర పరీక్షకు రెండు జవాబుపత్రాలు(బుక్‌లెట్లు) ఇచ్చే విషయమై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. పదోతరగతిలో ఏ సబ్జెక్టుకు లేనివిధంగా సామాన్యశాస్త్రానికి ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. ఒకరు భౌతిక, రసాయనశాస్త్రాలు, మరొకరు జీవశాస్త్రం, పర్యావరణ విద్యను బోధిస్తారు. ఇదే పద్ధతిలో విద్యార్థుల బుక్‌లెట్లను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. రెండింటినీ ఒకే ఉపాధ్యాయుడు దిద్దడం కుదరదు. ఇందుకోసం రెండు ఆన్సర్‌షీట్‌లు ఇవ్వాలని యోచిస్తున్నారు.