• facebook
  • whatsapp
  • telegram

హెచ్‌సీయూ ప్రవేశ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో 2020-21 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ గడువును జూన్‌ 30 వరకు పొడిగించారు. ఈ మేరకు వర్సిటీ ప్రజాసంబంధాల అధికారి ఆశిష్‌థామస్‌ జాకబ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 3న ప్రవేశాలకు సంబంధించి వర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో దరఖాస్తుల స్వీకరణకు మే 22ను చివరి తేదీగా ప్రకటించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ గడువును జూన్‌ 30 వరకు పొడిగించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌, పీజీ, ఎంఫిల్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లోని 2,456 సీట్లకు పరీక్షలు నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించనున్నారు.