• facebook
  • whatsapp
  • telegram

50000 తాత్కాలిక ఉద్యోగాలు: అమెజాన్‌

బెంగళూరు: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతో 50000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. గోదాములు, డెలివరీ నెట్‌వర్క్‌ విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడంతో ఇ-కామర్స్‌ సంస్థల కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గత కొన్ని రోజుల్లో స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి సంస్థలు ఉద్యోగులను తొలగించగా.. అమెజాన్‌ బరీ సంఖ్యలో తాత్కాలిక నియామకాలకు ముందుకురావడం గమనార్హం.