• facebook
  • whatsapp
  • telegram

పీజీ మెడికల్‌ ప్రవేశాలకు సీట్‌ మ్యాట్రిక్స్‌ విడుదల

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ మెడికల్‌, డెంటల్‌కు సంబంధించి సీట్‌ మ్యాట్రిక్స్‌ను విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం మే 23న‌ విడుదల చేసింది. పీజీ మెడికల్‌కు సంబంధించి 2185 సీట్లకు కన్వీనర్‌ కోటా కింద 1127, యాజమాన్య కోటా కింద 583, ఆల్‌ఇండియా కోటా కింద 475 సీట్లను సీట్‌ మ్యాట్రిక్స్‌లో పొందుపర్చారు. డెంటల్‌కు సంబంధించిన వివరాలనూ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఉంచారు. పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించి జీవో 43, ఫీజుల విషయంలో ప్రభుత్వం స్పష్టతనిస్తే వెబ్‌ ఆధారిత మొదటి విడత కౌన్సెలింగ్‌ ఆప్షన్ల నమోదు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

  • Tags