• facebook
  • whatsapp
  • telegram

కొత్తగా 16 వైద్య కళాశాలలు

* మంత్రి ఆళ్ల నాని
నరసాపురం, నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మే 25న‌ ఆయన విలేకరులతో మాట్లాడారు. 11 వైద్య కళాశాలల ఆధునికీకరణకు చర్యలు చేపట్టామన్నారు. ఒక్కో కళాశాల నిర్మాణానికి రూ.350 కోట్ల నుంచి రూ.500 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపడతామని వివరించారు. నరసాపురం ప్రభుత్వాసుపత్రి విస్తరణకు రూ.11 కోట్లు, అసంపూర్తిగా ఉన్న నర్సింగ్‌ కళాశాల పూర్తి చేయడానికి రూ.1.50 కోట్లు కేటాయించామన్నారు.