• facebook
  • whatsapp
  • telegram

పీజీ వైద్య విద్య ఫీజులపై పునః పరిశీలన?

ఈనాడు, అమరావతి: పీజీ వైద్య, దంత వైద్య విద్య కొత్త ఫీజులపై పునః పరిశీలన చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. కళాశాలల వారీగా ఫీజులను ఖరారు చేస్తూ ఏపీ ఉన్నత విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించి ఆమోదం తెలిపే సమయంలో పునఃపరిశీలన జరపాలని అధికారులకు ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. మే 27న‌ కొత్త ఫీజులపై ఉత్తర్వులు రాగానే ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ శ్యాంప్రసాద్‌ వెల్లడించారు. నోటిఫికేషన్‌ జారీలో జాప్యం జరిగినందున తొలివిడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఒకటి, రెండు రోజుల వరకు ఆలస్యం కానుంది. ఒకే తరహా ఫీజులను అమలు చేయాలని వైద్య కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 2017-18 విద్యా సంవత్సరంలో ఒకే తరహాలో ఖరారు చేసిన ఫీజులను కమిషన్‌ తగ్గించింది.