• facebook
  • whatsapp
  • telegram

విద్యా రుసుములు పెంచొద్దు: కమిషన్‌ ఛైర్మన్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు 2020-21 విద్యా సంవత్సరంలో రుసుములను పెంచొద్దని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు ఓ ప్రకటనలో ఆదేశించారు. ఏ యాజమాన్యమైనా పెంచితే తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు మొదటి త్రైమాసికానికి సంబంధించిన రుసుములనే వసూలు చేయాలని, తల్లిదండ్రులు ఈ మొత్తాన్ని చెల్లించలేకపోతే వాయిదాల్లో తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు తమ వివరాలను జూన్‌ 9 సాయంత్రం 5 గంటల లోపు www.apsermc.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు.