• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రంలో 15 వేల ఉపాధ్యాయ ఖాళీలు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ దస్త్రాన్ని సిద్ధం చేసింది. ఖాళీలు, ఎక్కువ కాలంగా ఒకే పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను సేకరించింది. బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పూర్తి వివరాలను అందించనుంది. కొందరు గత 10 ఏళ్లుగా దూర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. బదిలీలపై దగ్గర పాఠశాలలకు రావొచ్చని ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.