• facebook
  • whatsapp
  • telegram

ఆ విద్యార్థులకు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: అనారోగ్యంతో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పరీక్షలు రాయించాలని విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై బుధవారం ఆమె డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి గంట ముందే విద్యార్థులను అనుమతిస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద రోల్‌ నంబర్ల కేటాయింపు వివరాలను నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని, వాటిని డీఈవో కార్యాలయాల వెబ్‌సైట్లోనూ ఉంచాలని ఆదేశించారు. కొత్త పరీక్షా కేంద్రాలను విద్యార్థులు, తల్లిదండ్రులు నాలుగు రోజులు ముందుగానే సరిచూసుకోవాలని కోరారు.

  • Tags