• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌లో సెక్షన్‌కు 40 మందే 

* మంత్రి సురేష్‌
ఈనాడు, అమరావతి: విద్యా వ్యవస్థలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని, ఇంటర్మీడియట్‌లో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులను పరిమితం చేస్తూ ఆదేశాలు ఇచ్చామని మంత్రి సురేష్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. గరిష్ఠంగా 9 సెక్షన్లకు 360 మందిని చేర్చుకునే విధంగా ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ఒక జూనియర్‌ కళాశాలలో రెండు సంవత్సరాలకు కలిపి 720 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. గతంలో గరిష్ఠంగా 1,584 మంది విద్యార్థులకు అనుమతి ఉండగా ఈ సంఖ్యను తగ్గించామని, దీంతో విద్యార్థులు చదువుకునేందుకు తరగతి గదులు ఇరుకుగా లేకుండా ఉంటాయని వెల్లడించారు. ఈ నిబంధలను పాటించని కళాశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.