• facebook
  • whatsapp
  • telegram

సెప్టెంబరులో డిగ్రీ ప్రవేశాలు

ఈనాడు, అమరావతి: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలను సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించనున్నారు. మొదటి ఏడాది విద్యార్థులకు సెప్టెంబరు 10 తర్వాత తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డిగ్రీ రెండు, మూడు ఏడాదిలోకి వచ్చే విద్యార్థులకు ఆగస్టులో తరగతులు ప్రారంభిస్తారు. ఆగస్టులోనే ఇంజినీరింగ్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించి, అనంతరం తరగతులు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత డిగ్రీ ప్రవేశాలు చేపడతారు.