• facebook
  • whatsapp
  • telegram

‘పది’ పరీక్ష కేంద్రాలపై వాట్సప్‌ గ్రూపు

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షా కేంద్రాలు, కాలపట్టిక, ఇతర సూచనలను తెలియజేసేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో వాట్సప్‌ గ్రూపులు తయారు చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఇన్‌ఛార్జి కమిషనర్‌ చిత్రారామచంద్రన్‌ పలు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల సమాచారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలిసేందుకు ఆయా పాఠశాలల వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లపై కేంద్రం పేరు, రోల్‌ నంబర్ల వివరాలు రాసి ప్రదర్శించాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల గేట్లు, ప్రాంగణాల వద్ద తల్లిదండ్రులు గుమిగూడవద్దని, నీడ ఉన్న చోటే విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని పేర్కొన్నారు.