• facebook
  • whatsapp
  • telegram

వైద్య విద్య పరీక్షల ఫీజు గడువు పెంపు

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో వైద్య విద్య పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా పరీక్షల ఫీజును రూ.5 వేల అపరాధ రుసుముతో చెల్లించేందుకు మే   31 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు గడువు పెంచినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ప్రకటనలో తెలిపారు.
టైం టేబుల్‌ విడుదల: పరీక్షల టైంటేబుల్‌ను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి వెల్లడించారు. పీజీ డిగ్రీ పరీక్షలు జూన్‌ 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు పేపర్‌-1, 22న పేపర్‌-2, 24న పేపర్‌-3, 26న పేపర్‌-4, పీజీ డిప్లొమా పరీక్షలు జూన్‌ 20న పేపర్‌-1, 22న పేపర్‌-2, 24న పేపర్‌-3 నిర్వహిస్తామన్నారు.