• facebook
  • whatsapp
  • telegram

ఐఎన్‌డీ-శాట్‌ పరీక్ష వాయిదా

ఈనాడు, దిల్లీ: స్టడీ ఇన్‌ ఇండియా ద్వారా ఉపకార వేతనాలు కోరుకునే విద్యార్థులకు నిర్వహించే ప్రామాణికమైన ఆన్‌లైన్‌ పరీక్ష ఇండియన్‌ స్కాలస్టిక్‌ అసెస్‌మెంట్‌ (ఐఎన్‌డీ-శాట్‌) వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు పరిశీలించి పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పేర్కొంది. పరీక్ష తేదీని త్వరలోనే వెల్లడిస్తామంది.