• facebook
  • whatsapp
  • telegram

బీఏఎస్‌ ప్రవేశాలు చేపట్టొద్దని నిర్ణయం

‌ఎస్సీ, ఎస్టీ వర్గాల పేద విద్యార్థులను కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌(బీఏఎస్‌), కార్పొరేట్‌ కళాశాలల’ పథకాలు ఈ ఏడాది నుంచి నిలిచిపోనున్నాయి. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాల కింద కొత్తగా ప్రవేశాలు చేపట్టొద్దని నిర్ణయించినట్లు సంక్షేమ శాఖల అధికారులు తెలిపారు. ఇప్పటికే 29,200 (బీఏఎస్‌ 27 వేలు + కార్పొరేట్‌ కళాశాల కింద 2,200) మంది విద్యార్థులు ఎంపికై చదువుతున్నారు. వీరు పైతరగతులకు వెళ్లాలంటే సాయం రెన్యువల్‌పై స్పష్టత రావాలి. రెన్యువల్‌ చేయాలా? వద్దా? అని ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘అమ్మ ఒడి’ పథకం కింద ఆర్థిక సాయం చేస్తున్నందున ఈ పథకాలు అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం.

  • Tags