• facebook
  • whatsapp
  • telegram

పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌పై అభ్యర్థుల్లో అయోమయం

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం చేపట్టిన పీజీ మెడికల్‌ కోర్సుల ప్రవేశాల తంతుపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఫీజులు తగ్గించడం వల్ల ఈ ఏడాది ప్రవేశాలు కల్పించబోమంటూ ప్రైవేటు కళాశాలలు ప్రకటించినా.. కన్వీనర్‌ కోటా సీట్ల ఆప్షన్ల నమోదుకు అన్ని ప్రైవేటు కళాశాలలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పేర్కొంది. కొందరు ప్రైవేటు కళాశాలలకూ ఆప్షన్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో మొదటి విడత కౌన్సెలింగ్‌ గందరగోళంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండు రోజులుగా పీజీ మెడికల్‌కు సంబంధించి 2700 మంది, పీజీ డెంటల్‌కు  350 మంది ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మే 31వ తేదీ మధ్యాహ్నం వరకు ఆప్షన్లు నమోదు చేసుకుంటే.. అదే రోజు సాయంత్రం విశ్వవిద్యాలయం సీట్లు కేటాయిస్తుంది.

  • Tags