• facebook
  • whatsapp
  • telegram

ముగిసిన పీజీ మెడికల్‌ తొలి విడత కౌన్సెలింగ్‌

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ పీజీ మెడికల్‌, దంత వైద్య విద్య మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆదివారం రాత్రితో ముగిసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు 57, 58 ప్రకారం.. ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టిన ప్రక్రియలో పీజీ మెడికల్‌(ఎండీ/ఎంఎస్‌) కోర్సుల్లో అందుబాటులో ఉన్న 1134 కన్వీనర్‌ సీట్లకు 1091 సీట్లు, దంత వైద్య కోర్సులో 235 సీట్లకు 219 భర్తీ అయినట్లు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులంతా ఆయా కళాశాలల్లో జూన్‌ 6వ తేదీలోగా చేరాల్సి ఉంది. మెరిటోరియస్‌ రిజర్వేషన్‌ కింద మెడికల్‌లో 187 మంది, ఎండీఎస్‌ కోర్సులకు 30 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు సీట్లు సాధించారు. ప్రైవేటు వైద్య కళాశాలలతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు యాజమాన్యాలతో ఉపకులపతి శ్యామ్‌ప్రసాద్‌  చర్చలు జరిపారు.
* పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించి ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన జీవోలు, కౌన్సెలింగ్‌ ప్రక్రియను సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో మే 31న‌  అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం జూన్‌ 2కు   వాయిదా వేసినట్టు విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు.

  • Tags