• facebook
  • whatsapp
  • telegram

ఎయిడెడ్‌ బడులపై వేలాడుతున్న కత్తి!

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్‌ పాఠశాలలను ‘ప్రభుత్వ పాఠశాల విద్య’లో కలపడమా? వాటిని ప్రైవేటు బడులుగా కొనసాగించడమా? అనే అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఇప్పటికే ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థలాలు సహా ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించేవి, ప్రభుత్వం నుంచి గ్రాంటు కోరుకోని యాజమాన్యాల వివరాలను సేకరించారు. ఈ వివరాలను కమిటీ అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. గుంటూరులో  జూన్‌ 1న కమిటీ సమావేశం కానుంది.

  • Tags