• facebook
  • whatsapp
  • telegram

జులై 5న ఎల్‌పీసెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీఐ విద్యార్థులు పాలిటెక్నిక్‌ రెండో ఏడాదిలో ప్రవేశించేందుకు నిర్వహించనున్న లేటరల్‌ ఎంట్రీ ఫర్‌ పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎల్‌పీసెట్‌)ను జులై 5న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరపాలని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణమండలి నిర్ణయించింది. ఆ పరీక్షకు జూన్‌ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆలస్య రుసుంతో 12 వరకు గడువు ఉందని సంచాలకుడు మూర్తి పేర్కొన్నారు.

  • Tags