• facebook
  • whatsapp
  • telegram

జూనియర్‌ కళాశాలల పునఃప్రారంభం వాయిదా

* కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తాం: ఇంటర్‌ బోర్డు
ఈనాడు, హైదరాబాద్‌: వార్షిక విద్యా క్యాలెండర్‌ ప్రకారం గతంలో ప్రకటించినట్లు జూన్‌ 1వ తేదీన రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలల పునఃప్రారంభం ఉండదని ఇంటర్‌బోర్డు కమిషనర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ కారణంగా అన్ని కళాశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేశామని, కొత్త తేదీని నిర్ణీత సమయంలో తెలియజేస్తామని పేర్కొన్నారు. జులై 5వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. వాటి ఫలితాలు జులై 20 నాటికి వెలువడతాయని అంచనా. ఈక్రమంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం తరగతులు జులై 15 తర్వాత, మొదటి ఏడాది ప్రవేశాలు ఆగస్టులో జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

  • Tags