• facebook
  • whatsapp
  • telegram

ఏపీ నిట్‌కు అరుదైన గౌరవం

తాడేపల్లిగూడెం గ్రామీణ‌, న్యూస్‌టుడే: ప‌శ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటైన ఏపీ నిట్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ప్రాంగణానికి ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) ప్లాటినం రేటింగ్‌ ప్రకటించిందని నిట్‌ డైరెక్టర్‌ సీఎస్పీ రావు వెల్లడించారు. నిట్‌ ప్రాంగణంలో తొలిదశలో నిర్మించిన పర్యావరణహిత భవనాలు, నాణ్యతా ప్రమాణాలు, మొక్కల పెంపకం, సౌర విద్యుత్తు, మురుగుపారుదల వ్యవస్థలను ఐజీబీసీ ప్రతినిధులు పరిశీలించి ప్లాటినం రేటింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం 100 పాయింట్లకుగాను ఏపీ నిట్‌ 76 పాయింట్లు సాధించినట్లు వెల్లడించారు. దీనివల్ల భవిష్యత్తులో కేంద్రం ప్రకటించే పలు రాయితీలు పొందే వెసులుబాటు లభిస్తుందని చెప్పారు.