• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ బోధనలో ఏఎన్‌యూ ఘనత

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరో అరుదైన రికార్డు సాధించింది. కొవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించిన విద్యాసంస్థల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ‘క్యూఎస్‌ ఐ గేజ్‌ ఈలీడ్‌ సర్టిఫికెట్‌ అవార్డు’కు ఎంపికైంది. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని జూన్ 1న‌ దిల్లీ నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించారు. క్యూఎస్‌ ఐ సీఈవో డాక్టర్‌ అశ్విన్‌ ఫెర్నాండెజ్‌, యూజీసీ మాజీ అదనపు కార్యదర్శి డాక్టర్‌ రేనూ బట్రా, భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణా ఎల్లా ముఖ్యఅతిథులుగా పాల్గొన్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. డేటా సేకరణ, నాణ్యత తదితర అంశాల ఆధారంగా మార్కులు కేటాయించారు. ఇందులో 150 మార్కులకుగాను 120 మార్కులు వచ్చిన విద్యాసంస్థలకు గుర్తింపు పత్రాలు అందించారు. వాటిలో దేశంలోనే మొదటి స్థానం దక్కించుకున్న ప్రభుత్వ విశ్వవిద్యాలయంగా ఏఎన్‌యూ గుర్తింపు సాధించిందని వర్సిటీ ఎఫ్‌ఏసీ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్‌ తెలిపారు. ర్యాంకు సాధనకు కృషి చేసిన డాక్టర్‌ నాగకిషోర్‌ను అభినందించారు.