• facebook
  • whatsapp
  • telegram

సీటు ఇచ్చారు.. రావద్దంటున్నారు!

ఈనాడు, అమ‌రావ‌తి: ఏపీలోని పీజీ వైద్య విద్యలో సీటు సాధించిన వారిని చేర్చుకునేందుకు ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విశ్వవిద్యాలయం జారీచేసిన ‘సీటు అలాట్‌మెంట్‌’ పేరుతో కళాశాలల్లో చేరేందుకు జూన్ 1న‌ వెళ్లిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. నోటిఫికేషన్‌కు అనుగుణంగా విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. సీట్లు పొందిన వారు జూన్‌ 4న మధ్యాహ్నం 3 గంటల్లోగా కళాశాలల్లో చేరాలి. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నా.. ప్రైవేటుగా చేర్చుకోవడం లేదు. దీనిపై ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.