• facebook
  • whatsapp
  • telegram

సప్లిమెంటరీలో పాసైనా రెగ్యులర్‌ విద్యార్థులే: ఇంటర్‌బోర్డు

ఈనాడు, హైద‌రాబాద్‌:‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మోడర్న్‌ లాంగ్వేజెస్‌ విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైనా వారిని రెగ్యులర్‌ విద్యార్థులుగానే పరిగణించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి కారణంగా మార్చిలో జరగాల్సిన ద్వితీయ సంవత్సరం రెండు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాటిని జూన్‌ 3వ తేదీన జరపాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. కాగా ఈ పరిస్థితుల్లో రవాణా సదుపాయం లేకపోయినా, ఇతర కారణాలతో ఆ రోజు విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేకపోతే జులైలో జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాయవచ్చని బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు.