• facebook
  • whatsapp
  • telegram

కేఎల్‌ డీమ్డ్‌ వర్సిటీ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, అమ‌రావ‌తి:‌ కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్‌ క్యాంపస్‌ల ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి జూన్‌ 10వ తేదీ నుంచి 17 వరకు నిర్వహించే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేశామని విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఎల్‌ఎస్‌ఎస్‌ రెడ్డి తెలిపారు. విజయవాడలోని వర్సిటీ కార్యాలయంలో జూన్ 1న‌ విలేకర్లతో మాట్లాడారు. ప్రవేశ పరీక్ష రాసిన వారు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు మెరిట్‌ ఆధారంగా ఇప్పటికే లింక్‌ను చరవాణులకు పంపినట్లు వివరించారు. లాక్‌డౌన్‌ వల్ల గడిచిన రెండు నెలలు నిర్వహించిన ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థుల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. అత్యున్నత సాంకేతికత, ఉన్నత శ్రేణి సర్వర్లు, వర్చువల్‌ సాఫ్ట్‌వేర్‌తో ప్రయోగ అంశాలనూ బోధించి, సెమిస్టర్‌ పరీక్షలనూ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అడ్మిషన్స్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌. జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ జులై మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు.