• facebook
  • whatsapp
  • telegram

పీజీ వైద్యవిద్య రెండో విడత కౌన్సెలింగ్‌

ఈనాడు, హైద‌రాబాద్‌:‌ తెలంగాణ‌లోని పీజీ వైద్య, దంత విద్య కోర్సుల్లో కన్వీనర్‌ కోటాలో రెండోవిడత ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జూన్ 1న ప్రకటన విడుదల చేసింది. జూన్‌ 2న ఉదయం 8 నుంచి మరుస‌టి రోజు సాయంత్రం 7 గంటల వరకు వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొంది. అర్హులు ప్రాధాన్యక్రమంలో కళాశాలల వారీగా తమ వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. తొలివిడతలో సీటు పొంది లాక్‌డౌన్‌ వల్ల కళాశాలల్లో చేరని అభ్యర్థులను రెండోవిడత ప్రవేశాల్లో కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది.