• facebook
  • whatsapp
  • telegram

పరీక్షల నిర్వహణలోనూ మార్పులు!

ఈనాడు, అమరావతి: కొవిడ్‌-19 ప్రభావంతో ఉద్యోగ నియామక రాత పరీక్షల నిర్వహణలోనూ మార్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కసరత్తు ప్రారంభించింది. కరోనా కారణంగా గ్రూపు-1, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, గెజిటెడ్‌, నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగాల రాత పరీక్షలు వాయిదాపడ్డాయి. వీటిని త్వరలో నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల మధ్య భౌతిక దూరం, శానిటైజేషన్‌ వంటి జాగ్రత్తలపై కమిషన్‌ సమాలోచనలు చేస్తోంది. స్పష్టత వచ్చాక... పరీక్షల తేదీలను ప్రకటించాలని యోచిస్తోంది. దూరం పాటింపు వల్ల పరీక్షా కేంద్రాలు పెరగనున్నాయి. 

  • Tags