• facebook
  • whatsapp
  • telegram

‘విజ్ఞాన్‌’కు ఎన్‌బీఏ టైర్‌ 1 అక్రిడిటేషన్‌

పొన్నూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం వడ్లమూడిలోని ‘విజ్ఞాన్‌ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ’ ఎన్‌బీఏ (నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌) టైర్‌ 1 అక్రిడిటేషన్‌ సాధించిందని వర్సిటీ అధ్యక్షుడు డాక్టర్‌ లావు రత్తయ్య తెలిపారు. జూన్ 4న‌ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రిడిటేషన్‌ లభించిన కోర్సుల్లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు ఉన్నాయన్నారు. ఒకేసారి 5 కోర్సులకు అక్రిడిటేషన్‌ సాధించిన ఏకైక సంస్థ విజ్ఞాన్‌ అని పేర్కొన్నారు.