• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ పుస్తకాల్లో క్యూఆర్‌ కోడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థులు సాంకేతికతను ఎక్కువగా ఇష్టపడుతున్నందున అందుకనుగుణంగా ఇంటర్‌ పాఠ్య పుస్తకాలను క్యూఆర్‌ కోడ్‌ విధానంలో ముద్రించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై ఇంటర్‌బోర్డు అధికారులు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ), తెలుగు అకాడమీ అధికారులతో జూన్ 5న‌ సమావేశం కానున్నారు. క్యూఆర్‌ కోడ్‌ పుస్తకాలు 2021-22 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఎస్‌సీఈఆర్‌టీ 8, 9 తరగతుల ప్రధాన సబ్జెక్టుల పుస్తకాలను క్యూఆర్‌ కోడ్‌ విధానంలో ముద్రించినందున ఆ సంస్థలోని నిపుణుల సూచనలను ఇంటర్‌బోర్డు తీసుకోనుంది.
ఎందుకీ క్యూఆర్‌ కోడ్‌?
* పాఠ్యాంశాల్లో అవసరమైనచోట ఈ కోడ్‌ను ముద్రిస్తారు.
* స్మార్ట్‌ ఫోన్‌ సహాయంతో దాన్ని స్కాన్‌ చేస్తే మరింత సమాచారం, వీడియోలు, చిత్రాలు ఫోన్‌లోకి వస్తాయి. బీ నేటి పోటీ ప్రపంచంలో పుస్తకంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే కాకుండా ఆసక్తి ఉన్నవారు, తెలివైన విద్యార్థులు మరింత లోతుగా, వివరంగా తెలుసుకోవాలనుకునే వారు ఉంటారు. వారికి క్యూఆర్‌ కోడ్‌ విధానం ఉపయోగపడుతుంది.
* పాఠ్యాంశాల్లో ఎంత సమాచారం పుస్తకంలో ఉండాలో, క్యూఆర్‌ కోడ్‌లో ఎంత ఉండాలో ఆయా తరగతులను బట్టి నిపుణులు నిర్ణయిస్తారు.